ఆదిలాబాద్ అమర జవానుల సోదరీమణులు రాఖీ కట్టి స్మరించుకున్నారు. కార్గిల్ ప్రకాష్, ట్రైనింగ్ లోని ఆకాష్ విగ్రహాలకు రాఖీలు కట్టారు. సౌత్ సుడాన్ అమరుడు సంజీవ్ కు ఐదేళ్లుగా సోదరీమణులు రాఖీలు. Adilabad Latest News: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక. బాల్యం నుంచి అల్లారుముద్దుగా పెరిగిన తోబుట్టువుల బంధాన్ని, బాధ్యతను గుర్తుచేసే పండుగ. తమ అన్న, తమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా రాఖీ కట్టందే అక్క చెల్లెళ్ల మనసు కుదుటపడదు. అలాంటిది తమ తోబుట్టువులు ఈ లోకంలోనే లేకపోతే, అందులోనూ దేశ సేవ కోసం చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతే, ఆ బాధ చెప్పుకోలేనిది. దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్లను తలచుకుంటూ వారి సోదరీమణులు ప్రతీఏటా రాఖీ పండుగ సందర్భంగా వారి విగ్రహాలకు రాఖీలు కడుతున్నారు. జీవితాంతం తమకు రక్షణగా ఉండాల్సిన అన్న,తమ్ముళ్ళు దేశ రక్షణ బాధ్యతను భుజాలపై వేసుకుని దూరమయ్యారంటూ దుఃఖాన్ని దిగమింగుకుని అమరురులైన వారి విగ్రహాలకు రాఖీలు కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తండా గ్రామానికి చెందిన గోతి ప్రకాష్ గత 2003లో కార్గిల్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. అయితే ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా ప్రకాష్ సోదరీమణులు, అలాగే ఆయన సోదరుడు బద్దుసింగ్ కుమార్తెలు అంకిత, వర్షా, క్రమం తప్పకుండా గోతి ప్రకాష్ విగ్రహానికి రాఖీ కట్టి, తమ బాబాయ్‌పై తమకున్న ప్రేమను, అనుబంధాన్ని స్మరించుకుంటారు. అయితే రాఖీ పండుగను పురస్కరించుకొని కార్గిల్ అమర జవాన్ గోతి ప్రకాష్ విగ్రహనికి వారు రాఖీ కట్టారు. అదే విధంగా సోదరి జైశ్రీ సైతం సోదరుడు గోతి ప్రకాష్ విగ్రహనికి రాఖీ కట్టింది. అమర జవాన్‌తో తనకున్న స్మృతులను స్మరించుకొని కన్నీంటి పర్యంతమైంది. ఏటా గ్రామంలో గోతి, ప్రకాష్ తో పాటు అటు సమఖా గ్రామానికి చెందిన అంతర్వేది రంగారావు కు సైతం వారి కుటుంబ సభ్యులు రాఖీ కట్టి స్మరించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాష్‌కు దేశ సేవ చేయాలని చిన్నప్పటి నుంచే తపన. దేశ సంరక్షణలో దేశ సరిహద్దున నిల్చోవాలని కలలుకన్నాడు. తన కలలను సాకారం చేసుకుంటూ గత ఏడాది అస్సాం రైఫిల్స్ కు ఎంపికయ్యాడు. కానీ విధి వంచించింది. పాసింగ్‌ఔట్ పరేడ్ కంటే ముందే ట్రైనింగ్‌లో 25 కిలోమీటర్ల రన్నింగ్ సాధన చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అక్క అఖిలకు, తమ్ముడు ఆకాష్ కు చిన్నపటి నుంచే ఎనలేని అనుబంధం. వయస్సులో అఖిల ఆకాష్ కంటే ఒక సంవత్సరం పెద్దయినప్పటికీ చదువులో మాత్రం ఇద్దరూ చిన్ననాటి నుంచి డిగ్రీవరకు క్లాస్మేట్స్. దీంతో వారి మధ్య ఎనలేని ఆప్యాయత, అనురాగం, కష్టాలైన దుఃఖాలైన, సుఖ సంతోషాలైన ఒకరితో ఒకరు పంచుకునే వారు. అలాంటి ఆకాష్ దేశ సేవ కోసం వెళ్ళి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఈ సంవత్సరం రక్షా బంధన్ పండుగకు తమ్ముడు ఆకాష్ లేని లోటును భరించలేక పోతుంది అఖిల. ఆకాష్ జ్ఞాపకార్థం ఊరిలో కట్టిన విగ్రహానికి రాఖీ కట్టి తమ్ముడి జ్ఞాపకాలను జ్ఞాపకాలను నెమరువేసుకుంది అఖిల. మరో వీర జవాన్ కుటుంబానిది ఇదే గాథ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్ర