Kaizer News

ముగిసిన అత్యపత్య పోటీలు

· State - Telangana · sakshi.com

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికల అత్యపత్య–2026 పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వన్నెల భూమన్న నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొన్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు. బాలుర విభాగం ఫైనల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జట్లు తలపడగా హైదరాబాద్‌ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నాగర్‌కర్నూల్‌ జట్టు విజేతగా నిలిచింది. నిర్మల్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ఎన్‌ఆర్‌ఐ తడక చంద్రశేఖర్‌, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ల క్ష్మణ్‌, నాయకులు పోశెట్టి, బ్రహ్మయ్య ట్రోఫీలు అందజేశారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు నిర్మల్‌ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్‌, సాఫ్ట్‌బాల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్‌, శ్రీనివాస్‌, గంగాధర్‌, సురేష్‌, భూమేష్‌, కోచ్‌లు సాయిరాజు, ముఖేష్‌ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News