Kaizer News

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భ

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

· State - Telangana · tv9telugu.com

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు ఉంటుంది. కొత్తిమీర వంటలకు రంగు రుచి, ఇవ్వడమే కాకుండా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అన్ని కూరల్లో దీన్ని వేస్తుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగించడం వలన ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మందిలో మటన్ వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అనే డౌట్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.ఎప్పుడూ కూడా మటన్ వండే సమయంలో మాంసం దాదాపు 80 శాతం ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిచూసుకునే సమయంలో కొత్తిమీర వేయాలంట. ముఖ్యంగా మటన్‌లో కొత్తిమీర ఆకుల కంటే, చిన్న చిన్న కాడలు వేయడం వలన కర్రీ మరింత రుచిగా ఉంటుందంట. ఇక 80 శాతం ఉడికిన తర్వాత కొత్తిమీర కాడలు వేసి, మటన్ కర్రీ పూర్తిగా ఉడికి, ఇక నిమిషంలో దించుతాం అనే సమయంలో, లేదా నిమిషంలో స్టవ్ ఆఫ్ చేస్తాం అనే సమయంలో కొత్తిమీర లేత ఆకులు తుంచి కర్రీలో వేయాలంట. దీని వలన ఆకుల సువాసన పోకుండా, కర్రీకి మంచి రంగు, రుచి ఇస్తుంది. అంతే కాకుండా ఇలాంటి ప్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుందంట. కొత్తిమీరే కాదండోయ్, కొత్తిమీరతో పాటు చివరలో కొంచెం లేత పూదీనా ఆకులు వేయడం వలన హోటల్ స్టైల్‌లో మటన్ కర్రీ ఉంటుందంట. అందువలన ఈ చిట్కాలు ఉపయోగిస్తూ మటన్ కర్రీ వండితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తిమీర ఇలా వేయడం వలన కర్రీ రుచి మారిపోతుందంట

Original source: tv9telugu.com
Read more on Kaizer News