ఉరుములు మెరుపులతో భారీ వర్షం గాంధారి, ఆంధ్రప్రభ : గాంధారి మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో నిర్మాణంలో ఉన్న ఆలయ గోపురం దెబ్బతింది. గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. వర్షం సమయంలో పెద్ద శబ్దాలతో పిడుగులు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సేవాలాల్ ఆలయంపై పిడుగు పడిన విషయం తెలుసుకున్న మండలంలోని ఆయా తండాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దెబ్బతిన్న ఆలయ గోపురాన్ని పరిశీలించారు