Kaizer News

కళా వైభవం: కరీంనగర్ ఫిలిగ్రీకి న్యూ లుక్!.. 450 ఏళ

కళా వైభవం: కరీంనగర్ ఫిలిగ్రీకి న్యూ లుక్!.. 450 ఏళ్ల కళాఖండాలకు జీఐ ట్యాగ్

· State - Telangana · v6velugu.com

వెండి తీగను చేతిలోకి తీసుకుని.. దానికి కళాత్మకమైన మెలికలు తిప్పితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అదే కరీంనగర్ ఫిలిగ్రీ. 450 ఏళ్ల చరిత్రను మోస్తున్న ఈ సున్నితమైన కళ నేడు కాలంతో పోటీ పడుతూ సరికొత్త రూపాల్లో ఒదిగిపోతోంది. గతంలో ఆధునిక ఆభరణాల పెట్టెలు, కేశాలంకరణ ఉపకరణాలు, రాఖీలు, నెమళ్లు, హంసలు, నమూనా పడవలతో సహా అలంకరణ వస్తువులు, పాన్​దాన్​​లు తయారుచేసేవారు. నేడు వెండి జువెలరీ, కార్పొరేట్ లోగోలు, మెమోంటోలను వెండి ఫిలిగ్రీ కళాకారులు తయారుచేస్తున్నారు. వెండి ధరలు పెరుగుతున్నా.. ప్రజల అభిరుచులు మారుతున్నా.. కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కళ మాత్రం కాలానుగుణంగా కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ కళ నేడు ఆధునిక ఆభరణాలు, కార్పొరేట్ లోగోలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వరకు విస్తరించింది. 450 సంవత్సరాల పురాతనమైన ఈ కళను కరీంనగర్ వెండి ఫిలిగ్రీ పనిని తర్కాసి అని కూడా పిలుస్తారు. కరీంనగర్ నుంచి10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గందల్ కోట, మొఘలులు, వారి వారసులైన నిజాంల ఆయుధ తయారీ కేంద్రంగా ఉండేది. నాడు ఈ కోట వివిధ రకాల లోహ కళలు, చేతిపనులు చేసే కళాకారులకు కేంద్రంగా ఉండేది. వెండి ఫిలిగ్రీ కళకు కాలానుగుణంగా కొత్త రూపు వస్తోంది. సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జోడిస్తూ కళాకారులు వినూత్నమైన వెండి కళాఖండాలను రూపొందిస్తున్నారు. దీంతో కరీంనగర్ ఫిలిగ్రీకి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు పెరుగుతోంది. గతంలో ధనవంతులు, ప్రముఖులు మాత్రమే కొనే ఫిలిగ్రీ కళాఖండాలు నేడు చిన్న జువెలరీల తయారీతో సామాన్యుల చెంతకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలను ప్రముఖులు, వివిధ దేశాల అధినేతలు, రాయబారులు, ఇతర సెలబ్రిటీలు కలిసినపుడు వారికి ఫిలిగ్రీ కళాఖండాలను బహుమతులుగా అందిస్తున్నారు. నంది విగ్రహాలు, రామప్ప, నెమలి కళాఖండాలను మెమోంటోలుగా అందిస్తూ ఫిలిగ్రీ కళను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్​లో గతంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల రాణులకు సీఎం రేవంత్ రెడ్డి నెమలి బ్రోచ్​లను బహుమతిగా అందించారు. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అశోక్ వెండితో తయారుచేసిన పెన్నును ప్రధాని మోదీకి బహుమతిగా అందజేశారు. ఆ తర్వాత కరీంనగర్​లో జరిగిన సభలో ప్రధాని మోదీ ఫిలిగ్రీ కళాకారుల కళావైభవాన్ని మెచ్చుకున్నారు. జీ20 సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెండితో తయారు చేసిన కోణార్క్ వీల్ బ్రోచ్​లను బహుమతిగా అందజేశారు. వెండి తీగలతో కళాకారులు తయారుచేసిన హ్యాండిక్రాఫ్ట్​ను వివిధ దేశాల అధినేతలు వారి జేబులు, టైలకు పెట్టుకున్నారు. పురాతన ఫిలిగ్రీ కళ అంతరించిపోకుండా కాపాడుకునేందుకు బంగారం పనిచేసే కుటుంబాలు వారి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఫిలిగ్రీ కళాకారులు సభ్యులుగా కరీంనగర్ కేంద్రంగా సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ (సిఫ్కా)ఆవిర్భవించింది. ఈ సొసైటీలో 300 మందికి పైగా ఫిలిగ్రీ కళాకారులు సభ్యులుగా ఉన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి కార్పొరేట్ లోగోలు, ఫ్యాషన్ డిజైన్లు, పెండెంట్స్,

Original source: v6velugu.com
Read more on Kaizer News