మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: భారత వాయుసేనలో సేవలందించిన అనంతరం ఎస్‌బీఐలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హరిహర గార్డెన్‌లో పదవీ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు భారత వాయుసేనలో సుమారు 20 ఏళ్లపాటు, ఎస్‌బీఐలో 18 ఏళ్లపాటు సేవలందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్‌బీఐ క్లాక్‌టవర్ మెయిన్ బ్రాంచ్‌లో స్పెషల్ అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. అలాగే ఎస్‌బీఐ అసోసియేట్ నల్గొండ మాడ్యూల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భార్య మంజుల, కుమారులు భాను ఉదయ్, జ్ఞాన సౌశీల్‌తో పాటు కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు