Kaizer News

Khammam Victim | మాకున్నదే ఈ చిన్నిల్లు..? కాంగ్రె

Khammam Victim | మాకున్నదే ఈ చిన్నిల్లు..? కాంగ్రెస్‌ వచ్చాకే కుప్పకూలుతున్న ఇండ్లు : ఖమ్మం బాధితుడు

· State - Telangana · ntnews.com

Khammam Victim | ఖమ్మంలో కాంగ్రెస్ సర్కార్‌ మరోసారి పేదల ఇళ్లపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అధికారులు పేదల ఇళ్ల కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంతో ఇప్పటికే బాధితులు రోడ్డెక్కారు. శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నాకు కూడా దిగారు. శ్రీనివాసనగర్‌ ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి బతుకుతున్నం.. డెవలప్‌ కాలేదు.. మాకు బతుకుదెరువు లేదు.. పని లేదు. మా నాన్న క్యాన్సర్‌తో చనిపోయిండు. మా పరిస్థితి ఏంది.. 20 సంవత్సరాల నుంచి ఇక్కడుంటున్నాం.. ఉన్న చిన్న ఇల్లును కూడా ఇప్పుడొచ్చి తీసేయమంటున్నారు.. ఎవడొస్తడో చూస్తా.. అసలు ఎందుకు తీసేయాలని ఈ ఇల్లులని ప్రశ్నించాడు. ఈ కట్టెల మండివాళ్లు పెద్దోళ్లకు డబ్బులు ఇచ్చారు. ఇది కరెక్ట్‌ కాదు.. మేం చిన్నప్పటి నుంచి ఉన్నం.. వీళ్లెక్కడి నుంచి వచ్చినోళ్లు.. ఈ ఇల్లును చూడండి.. మేం సంపాదించుకుంటే ఈ ఇల్లు ఇట్లుంటదా..? మాకింకా వేరే దగ్గరు కూడా ఏం లేదు.. ఎంక్వైరీ చేసుకోండి.. ఈ రోడ్లు కూడా ఈ మధ్యనే వచ్చినయి.. ఏదో అవసరానికి వాడుకుంటున్నారు.. ఈ రోడ్లేశారు.. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మాకున్నదే ఈ చిన్న ఇల్లు. మాజోలికి గతంలో ఏ ప్రభుత్వం కూడా రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినంకనే ఇండ్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. గతంలో పట్టాలిచ్చారు.. ఇప్పుడొచ్చి ఇల్లు కూల్చేయమంటున్నారు.. ఎందుకిచ్చారు ఇవి.. అని ప్రశ్నించారు. ఇక్కడ ఇల్లు కదులుతయంటే అస్సలు ఊరుకోరు. లక్షలు ఇచ్చినా.. కోట్లు ఇచ్చినా ఊరుకోరు.. మొత్తం చేసిందంతా ఆ కట్టెలమండివాళ్లేనని సదరు బాధితుడు చెప్పుకొచ్చాడు. ఉన్న ఈ చిన్న గుడిసె కూడా తీసేస్తే.. మేము ఎక్కడికి పోవాలి? అసలు మేము ఇల్లు ఎందుకు తీసేయాలి.. మాకు పట్టా ఉంది ఏ ప్రభుత్వం మా జోలికి రాలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలా అవుతుంది ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేద ప్రజల ఇళ్లను… https://t.co/GAcxZpbrNl pic.twitter.com/ToA2m1Ji4R Plank Exercise | రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ త‌గ్గుతుంది.. నిపుణుల వెల్ల‌డి.. RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు! iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్‌ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్‌ అమ్మకాలు..!

Original source: ntnews.com
Read more on Kaizer News