Kaizer News

కాగజ్‌‌‌‌‌‌నగర్:అక్రమంగా పశువుల తరలింపు.. ఆరుగురు

కాగజ్‌‌‌‌‌‌నగర్:అక్రమంగా పశువుల తరలింపు.. ఆరుగురు అరెస్ట్..41 పశువుల స్వాధీనం

· State - Telangana · v6velugu.com

కాగజ్‌‌‌‌‌‌నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 41 పశువులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు పశువులను కొని ప్రాణహిత నది మీదుగా సుస్మీర్‌‌‌‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్‌‌‌‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో బెజ్జూర్ ఎస్సై ఎండీ సర్తాజ్ పాషా సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. పశువులను తరలిస్తున్న గౌస్, అమీర్, అశోక్, మల్లేశ్, పర్దేసి, ఆనంద్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 ఎద్దులు, 21 ఆవులు, 10 దూడలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News