సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు అవసరమని ఏఐఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ లేకుండా అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహం అసంపూర్ణంగానే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్‌కు సలహా ఇస్తూ ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అధినేత తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఓవైసీ పార్టీతో సహకారం అవసరమని సూచించారు