Kaizer News

పుల్లను తీపి చేసే... మిరాకిల్‌ ఫ్రూట్‌!

పుల్లను తీపి చేసే... మిరాకిల్‌ ఫ్రూట్‌!

· State - Telangana · sakshi.com

బుజ్జాయిలూ! మీరు పుల్లగా ఉండే నిమ్మకాయను తిన్నప్పుడు అది మీకు తియ్యగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అలా చేసే పండు ఉంది. దాని పేరు ‘మిరాకిల్‌ ఫ్రూట్‌’. ఈ పండు తిని, ఆ గుజ్జును నాలుకకు రాసుకున్న తర్వాత మీరు ప్రపంచంలోనే అత్యంత పుల్లటి నిమ్మకాయ తిన్నా లేదా చేదుగా ఉండే పదార్థాలు తిన్నా అవన్నీ ఎంతో తియ్యగా అనిపిస్తాయి. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో దొరికే ఈ పండును నైజీరియాలోని యోరుబా తెగ ప్రజలు ‘ఆగ్బాయున్‌’ అని పిలిస్తే, ఘనా దేశంలో ‘అసా’ లేదా ‘తామి’ అని, మరికొన్ని ప్రాంతాల్లో ‘లెడిడి’ అని పిలుస్తారు. ఈ పండు చూడటానికి మన చిన్న ద్రాక్షపండు లాగా ఎర్రగా ఉంటుంది. దీని సొంత రుచి పెద్దగా తీపిగా ఏమీ ఉండదు. కానీ ఈ పండును తిన్న తర్వాత ఏది తిన్నా తియ్యగా ఉంటుంది. సైన్స్‌ ఏమిటంటే ఈ పండులోని మిరాకులిన్‌ అనే ప్రొటీన్‌ మన నాలుకపై ఉండే రుచిని తెలిపే కణాలకు లాక్‌ వేసేస్తుంది. దీనివల్ల మన నాలుక పులుపును, చేదును గుర్తించలేదు. కేవలం తీపిని మాత్రమే మెదడుకు పంపుతుంది. పిల్లలు ఈ పండును హాయిగా తినవచ్చు! భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News