చింతకాని, ఆంధ్రప్రభ : పేదలకు వైద్య సేవలు మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చింతకాని మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆస్పత్రికి శనివారం సిరెంజెస్‌ను దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలు ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిరెంజెస్ దానం చేయడం అభినందనీయమని డాక్టర్ అల్తాఫ్ అన్నారు. కార్యక్రమంలో చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, కాంగ్రెస్ వందనం గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం శంకర్రావు, ఉపాధ్యక్షుడు ఎస్కే మోయిన్, గ్రామ పెద్దలు కామసాని శంకర్‌రావు, టీడీపీ నాయకులు బండి ప్రసాద్, గడ్డం రాఘవులు తదితరులు పాల్గొన్నారు