బాలానగర్, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని మోతిగన్పూర్ గ్రామంలో గ్రామైక్య సహకార సంఘం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సంఘం అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి ఫాతిమా బేగం ఆధ్వర్యంలో సీఆర్పీ బృందం సభ్యులకు శిక్షణ ఇచ్చింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ సహకార సంఘాల ప్రాముఖ్యతను సభ్యులకు వివరించారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళల అభివృద్ధికి సహకార సంఘాల ద్వారా ఎల్లప్పుడూ తోడ్పాటు ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ ప్రవీణ్ హాజరయ్యారు. వార్డు సభ్యులు, గ్రామ సంఘం సభ్యులు, సీఆర్పీ బృంద సభ్యులు ఎస్‌కే చాన్‌సుల్తానా, విజయలక్ష్మి, గ్రామ సంఘం వివోఏ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు