టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రోమాంచకం' (Romanchakam). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా మూవీని నిర్మిస్తున్నారు. న్యూ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీంతో పాటు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ వంగాపై ప్రశంసలు కురిపించారు. సందీప్‌పై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. 'మా ఇద్దరి మధ్య డైరెక్టర్, హీరో, బ్రదర్, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు. అంతకు మించింది. అర్జున్ రెడ్డి టైంలో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నమే చేశాం. ఆ టైంలో మాకు డబ్బు, ఫేం ఏమీ లేదు. కేవలం ధైర్యంగా ముందుకు అడుగేశాం. నా మీద నమ్మకంతో తన బ్రదర్, ఫాదర్‌తో పొలం అమ్మించి మరీ సినిమా చేశాడు. వాళ్ల ఫ్యామిలీ సంపాదన మొత్తం ఓ సినిమాపై ఇన్వెస్ట్ చేశాడు. సందీప్ కోసం నేను ఎక్కడివరకైనా వెళ్తా. నాకోసం సందీప్ ఎక్కడివరకైనా వస్తాడు. ఆయన పిలిచాక నేను ఈ ఫంక్షన్‌కు రాకుంటే బతికి ఎందుకు?, సుమంత్‌ను చూసినప్పుడు ఆయన కళ్లల్లో సినిమా పట్ల ఓ డ్రీమ్ కనిపించింది. మేమ్ ఫేమస్ సినిమాకు నా వంతు ప్రమోషన్ చేశా. సందీప్ అన్న ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. .. ఏఎస్సై బబిత ఏం చేసింది? డైరెక్టర్ వేణుగోపాల్ స్క్రిప్ట్‌లో ఉన్న దాని కంటే చాలా బాగా సినిమా తెరకెక్కించాడని చెప్పారు సందీప్ వంగా. 'ఇందులో నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేం కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి బాగా నటించాడు. అనంతిక పర్ ఫార్మెన్స్ రియల్లీ గుడ్. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు నీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. నాకు, విజయ్ కు అర్జున్ రెడ్డి రిలీజైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు నీకూ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. విజయ్ అన్న, సందీప్ అన్న అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదని... తమపై ఆ సినిమా ఎంతో ఇంపాక్ట్ చూపించిందని చెప్పారు హీరో సుమంత్ ప్రభాస్. సెప్టెంబర్ 3న రోమాంచకం క్యూట్ మూవీ ఫీల్ రెండున్నర గంటలు కచ్చితంగా ఉంటుంది. TE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సే