తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన మంత్రి సురేఖ తన మంత్రి పదవికి ఎసరొస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా? రేవంత్ పాలనపై రెఫరెండంగా ఉపఎన్నికకు వెళ్లేందుకు నిర్ణయం! తొలుత రాఖీ కట్టి సీఎంతో రాజీకి మంత్రి కొండా సురేఖ ప్రయత్నం సానుకూలత రాకుంటే అమీతుమీ ఒత్తిడి వచ్చినా తగ్గేదిలేదనే సంకేతం ఇప్పటికే మల్లికార్జున ఖర్గేను కలిసి తమ వైఖరిని స్పష్టం చేసిన కొండా హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. ప్రత్యేకంగా చేయించి కట్టిన ఈ రాఖీతో ఆమె రాజీ కోసం వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివాదానికి ముగింపు పలికే చివరి ప్రయత్నంగా కొండా దంపతులు రాఖీ రాజకీయాన్ని ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ రాఖీ అస్త్రానికి కూడా రేవంత్‌రెడ్డి దిగిరాకుంటే.. చిట్టచివరిగా రాజీనామా అస్త్రం ప్రయోగించి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎంతటి ఒత్తిడి వచ్చినా.. సరెండర్ అయ్యేది లేదని, తెగేదాకా నిలబడాలని కొండా దంపతులు గట్టి నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బలవంతంగా మంత్రి పదవి నుంచి తప్పించే పరిస్థితి వస్తే.. మౌనంగా ఉండకూడదని, మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉపఎన్నిక సమరం పూరించి పోరును నేరుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఉపఎన్నికను రేవంత్ ప్రభుత్వంపై, ఆయన పరిపాలనపై తిరుగులేని రెఫరెండంగా మార్చి గట్టి రాజకీ య సవాల్ విసరాలనేది కొండా వర్గం వేస్తు న్న ఎత్తుగడగా వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సెప్టెంబర్ 7 లోపు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి సైలెంట్‌గా తప్పించాలని రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తులు ఒక్కటి కూడా పారకపోవడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని పీసీసీ క్రమశిక్షణా సంఘం తప్పుబట్టింది. సమగ్ర విచారణ జరిపి నివేదికను పీసీసీకి అందజేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఆమెపై వేటు తప్పదనే సంకేతాలనే ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆమెను కాపాడుకుంటూ వచ్చానని, ఇక కాపాడలేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేతులెత్తేశారట. కొండా సురేఖ నేరుగా బెంగళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనతో తన వైఖరిని, ప్రభుత్వంలో తనకు ఎదురవుతున్న పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం. ఖర్గే ఎలాంటి అభయం ఇచ్చారో గానీ.. ఆ తర్వాత ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. క్రమశిక్షణ కమిటీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఆమె బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడే భట్టిని కలిసేందుకు కొండా దంపతులు ప్రయత్నించగా, ఆయన నిరాకరించిన ట్టు ప్రచారం జరిగ