Shorts వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణం, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తెచ్చేలా నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ హరీష్ చంద్ర రెడ్డి, ఆర్డీఓ సుమ, ఎన్‌పీడీసీఎల్, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు