నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ ప్రోత్సహించి.. ఇప్పుడు చార్జీల భారం మోపొద్దు డిజిటల్ నుంచి మళ్లీ క్యాష్ వైపు మళ్ళే అవకాశం అలవాటు చేసి జేబుకు చిల్లు పెడుతున్నారు అంటున్న సామాన్యులు చార్జీల మోత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతున్న’ ప్రజలు హనుమకొండ /శాయంపేట, ఆంధ్రప్రభ: చేతిలో నగదు లేదు.. బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు.. క్యూలో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్( యూపీఐ ) ద్వారా మొబైల్లో రెండు క్లిక్ లతో బిల్లులు, ఫీజులు చెల్లిస్తున్న రోజులివి. దాదాపు 70 శాతం మంది యూపీఐ ద్వారానే అన్నింటికీ పేమెంట్లు చేస్తున్నారు. పెద్ద వ్యాపార సంస్థలకు రూ. 2 వేలకు మించి చెల్లింపులు జరిపితే చార్జీలు తప్పవని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఈ చార్జీలు వ్యాపార సంస్థలకే వర్తించనున్నాయి. వ్యాపార సంస్థ నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందని ప్రకటించినప్పటికీ చివరకు ఆ భారం వినియోగదారులపైనే వేస్తారని ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ చెల్లింపునకు అలవాటు పడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ. 2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ. 12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్ళే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ పద్ధతి ఆ సాధారణ స్థితిలో వ్యాపారులు, వినియోగదారుల ఆదరణను చురగొంది. ఫోన్ నెంబర్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి వెనువెంటనే జరిగే చెల్లింపులు అద్భుతాన్నె సృష్టించాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్( యూపీఐ ) విధానం ద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న సేవలు.. అక్టోబర్ 15 నుంచి భారం కానున్నాయి. అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్ళించే లక్ష్యంతో తొలుత యూపీఐ ఉచితమే అని తాయిలం చూపించిన ప్రభుత్వం.. దేశ ప్రజల్ని అలవాటు చేశాక ప్లేట్ ఫిరాయించిందని, యూపీఐ ను కూడా ఆదాయ వనరుగా మార్చుకునేందుకు యత్నించడంలో భాగంగానే చార్జీల మోత మోగిస్తుందని సామాన్యులు నిప్పులు చెరుగుతున్నారు. యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రజల్లోకి బాగా విస్తరించిన నేపథ్యంలో వ్యాపార లావాదేవీలపై ఎండిఆర్ విధించడం విమర్శలకు తావిస్తుంది. అంతేకాదు.. నిలకడగా సాగుతున్న డిజిటల్ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చార్జీలు విధించొద్దు: మంద సురేష్, బీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోట్లాది మంది నిత్యం యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, సామాన్యులకు యూపీఐ సులభమైన విధానం. అలాంటి ప్రాముఖ్యత కలిగిన యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించి ఆర్థిక భారంగా మోపరాదు. ముందుగా డిజిటల్ పేమెంట్స్ అలవాటు చేసి ఇప్పుడు చార్జీలు వసూలు చేయడం దారుణం. ఈ చార్జీల