Shorts Khammam: ఖమ్మం జిల్లా సర్వ జన ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్యంతో పాటు మానసిక వైద్య విభాగం బాధితులకు విశిష్ట వైద్య సేవలు అందిస్తూ వారికి నూతన జీవితాన్ని అందిస్తోంది. సాధారణ మానసిక సమస్యల మొదలుకొని, వ్యసన విముక్తి, చట్టపరమైన సంరక్షణ దాకా ఎన్నో విభాగాలలో ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తుంది. సాధారణ మానసిక వైద్య సేవల విభాగంలో సాధారణ మానసిక వైద్య చికిత్సలతో పాటు మాతా-శిశు మానసిక ఆరోగ్యం, బాల్యము నుండి వృద్ధాప్యం వరకు వచ్చే వివిధ రకాల మానసిక సమస్యలకు వ్యాధి నిర్ధారణ, సంపూర్ణ చికిత్స సేవలు అందుతున్నాయి. ఇక్కడ నెలకు సుమారు 300 వరకు కేసు నమోదవుతుండగా, ఒక్కో కేసుకు వ్యాధి తీవ్రతను బట్టి 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితితో చికిత్స అందిస్తున్నారు. వ్యసన విముక్తి (De-addiction) సేవల్లో భాగంగా మద్యం (Alcohol), పొగాకు/సిగరెట్ (Tobacco), గంజాయి, చరష్, ఓపియాయిడ్ (Opioid) వంటి మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి ఇక్కడ పునరావాస సేవలు అందుతున్నాయి. వ్యసన విముక్తికి బాధితులకు కౌన్సిల్లింగ్, అవసరమైన వైద్య సేవలు అందించి, వారికి తిరిగి యధాస్థితి జీవితాన్ని ప్రసాదించడానికి అన్ని విధాల చేయుత అందిస్తున్నారు. దీనితో బాధితుని కుటుంబీకులు ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. ప్రతి నెలా దాదాపు 60 కేసులలో వ్యసన ప్రభావం నుండి స్వేచ్ఛను, పునరావాసాన్ని (Rehabilitation) కల్పిస్తున్నారు. కేసులో బాధితుని స్థితిని బట్టి సమయానుసారంగా తగుచర్యలు చేపట్టడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి 8 వారాల పాటు ప్రతి వారం కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం ఇస్తారు. ఆ తర్వాత 'ర‍్యాపిడ్ డ్రగ్ ప్యానెల్ టెస్టింగ్' (Rapid drug panel testing) చేసి, ఫలితం నెగెటివ్ అని వస్తే న్యాయస్థానానికి నివేదిక ఇచ్చి కేసు కొట్టేసేలా విజ్ఞప్తి చేస్తారు. వైద్య-న్యాయ సంబంధిత (Medico-Legal) సేవలు ఈ విభాగంలో నెలకు 20 కేసులు నమోదు కాగా, నెలకు సగటున 5 గురు వ్యసనం నుండి పూర్తిగా బయటపడి మార్పు చెందుతున్నారు. ప్రతి గురువారం ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ట్రాన్స్ జెండర్ల కోసం ఒ.పి (O.P) నిర్వహిస్తున్నారు. వివక్ష లేకుండా రహస్యంగా నిపుణులైన వైద్యులతో చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ప్రత్యేక సేవలు & క్లినిక్‌లు ట్రాన్స్ జెండర్ క్లినిక్ కు నెలకు సగటున 5 కేసులు వస్తున్నాయి. మానసిక వైద్య విభాగం ద్వారా పోక్సో (POCSO) బాధితులకు సేవలు అందించడం జరుగుతుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలబాలికలకు లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే చట్టం కింద మానసిక స్థితి విశ్లేషణ, కౌన్సెలింగ్, వైద్యం, న్యాయస్థానానికి నివేదికలు సమర్పిస్తున్నారు. నెలకు సుమారు 10 కేసులు వస్తుండగా సర్వ జన ఆసుపత్రి తగు చర్యలు తీసుకుంటున్నది. ఖైదీలకు మానసిక చికిత్సలో భాగంగా జైలు నుండి డిమాండ్ ఆధారంగా తీసుకొచ్చే ఖైదీలకు మందులు మరియు కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తారు. నేషనల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ క్రింద సామాజికంగా బలహీనంగా ఉన్న వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయం అందేలా చూస్తున్నారు. నెలకు సుమారు 10 మంది ఖైదీలు సమస్యలతో సర్వ జన