Kaizer News

ఈడీ వస్తేనే వాస్తవాలు బయటికి..?

ఈడీ వస్తేనే వాస్తవాలు బయటికి..?

· State - Telangana · prabhanews.com

అక్రమం రూ.10 కోట్లకు పైమాటే ఈ సొమ్మును దగా చేసింది ఎవరు? అక్రమార్కుడికి బ్యాంకు సిబ్బంది సహకరించారా? లోకల్ గోల్డ్, ఫైనాన్స్ సంస్థల పాత్ర ఏమిటి? సమగ్ర విచారణ నిర్వహిస్తేనే వాస్తవాలు బయటపడే అవకాశం అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: నియోజకవర్గ కేంద్రంలో సంచలనం రేకెత్తించిన బంగారం తాకట్టు కుంభకోణం వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగితేనే నిజానిజాలు బయటపడే అవకాశం ఉందని బాధితులు, స్థానికులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కుంభకోణం జరిగింది వందలు, వేలు కాదు.. అక్షరాలా రూ.10 కోట్లకు పైమాటే అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తాము తాకట్టు పెట్టిన బంగారం అసలు ఎంతకు ఉంది? ఎక్కడ ఉంది? ఉందా లేదా? అన్న అనుమానంతో వందలాది మంది బాధితులు పట్టణంలోని మూడు బ్యాంకుల వద్దకు నాలుగు రోజులుగా తిరుగుతున్నారు. కుంభకోణానికి మూలంగా భావిస్తున్న, కొంతకాలం క్రితం వరకు శ్రీరామ్ ఫైనాన్స్‌లో, ప్రస్తుతం సీఏస్‌బీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లింగిశెట్టి నాగ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు నుంచి ఖాతాదారులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో వారు చేసేదేమీ లేక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోతున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టిన వారు అసలు తమ బంగారం ఎంతకు పెట్టారు? ఏ బ్యాంకులో పెట్టారు? అసలు బ్యాంకులో ఉందా లేదా? స్థానికంగా ఉన్న ఫైనాన్స్ దుకాణాల్లో ఉందా? అసలు ఉందా లేదా? అన్న ప్రశ్నలకు సుబ్బు ఏ విధమైన సమాధానం కూడా ఇవ్వకపోవడంతో వందల మంది బాధితులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు రోజుల నుంచి సీఏస్‌బీ బ్యాంకు వద్ద జరుగుతున్న సుదీర్ఘ ఎపిసోడ్‌లో బ్యాంకు దగ్గరకు వచ్చిన సుమారు 200 మంది బాధితుల్లో కేవలం 20 నుంచి 25 మంది తాకట్టుదారులకు మాత్రమే తాకట్టు పత్రాలు దొరకడం, మిగిలిన వారికి ఏ ఒక్కరికీ కనీసం పత్రాలు కూడా దొరకకపోవడంతో వారు బంగారం ఏమైందోనని బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేసి, చేసేదేమీ లేక అక్కడి నుంచి బాధాతప్త హృదయంతో నిష్క్రమిస్తున్నారు. తాకట్టు పెట్టిన పత్రాలు దొరికితే చాలు.. ఎంత అయితే అంత నగదు చెల్లిద్దాం అన్నట్లుగా ఉంది ఖాతాదారుల పరిస్థితి. గడిచిన రెండు రోజులుగా సీఏస్‌బీ బ్యాంకు వద్ద సినిమా మార్నింగ్ షో టికెట్ల కోసం కొట్టుకున్నట్లుగా తమ తమ పత్రాల కోసం ఖాతాదారులు ఎగబడ్డారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పత్రాలు దొరికిన వారికి అయితే వారిది ఒక ఏడుపులాంటి పరిస్థితి. ఎందుకంటే పత్రాలు దొరికిన వారు తమ బంగారాన్ని రూ.10 లక్షలకు తాకట్టు పెడితే రూ.25 లక్షలు, రూ.15 లక్షలకు తాకట్టు పెడితే రూ.35 లక్షలు, రూ.20 లక్షలకు తాకట్టు పెట్టిన వారికి రూ.46 లక్షలు.. ఈ విధంగా ప్రతి ఒక్కరి నుంచి రూ.10 లక్షలకు పైచిలుకు అదనంగా డబ్బు లాగేయడంతో లబోదిబోమంటున్నారు. వీరు చేసేదేమీ లేక ఉన్న బంగారం కూడా పోతుందని, బంగారం మీద పూర్తిగా డబ్బులు తెచ్చేస్తే తమ పరిస్థితి ఏంటని భావించి, శనివారం ఉదయం సీఏస్‌బీ బ్యాంకు వద్ద నోట్ల కట్టలతో, డబ్బుల సంచులతో క్యూ కట్టి తమ బంగారాన్ని సుమారు 30 మంది వరకు కస్టమర్లు ఎగబడి మరీ తీసుకెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పైన పేర్కొన్న 30 మంది కస్టమర్లకు

Original source: prabhanews.com
Read more on Kaizer News