Kaizer News

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

· State - Telangana · prabhanews.com

శనివారం అమ్మవారిని దర్శించుకున్న 46,246 మంది 60,512 మంది కి అమ్మవారి ప్రసాదం అన్నప్రసాదం స్వీకరించిన 9,950 భక్తులు.. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారుల విస్తృత ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నగరం, పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు దర్శన క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం రోజువారీ గణాంకాల ప్రకారం శనివారం మొత్తం 46,246 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం కోసం 7,444 టికెట్లు జారీ చేశారు. భక్తులకు 60,512 యూనిట్ల ప్రసాదం అందించారు. వివిధ సేవల్లో 317 మంది పాల్గొన్నారు. మొక్కుబడుల్లో భాగంగా 2,012 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం కూడా అందించారు. శనివారం 9,950 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. దేవస్థానానికి భక్తుల నుంచి రూ.3,43,349 విరాళాలుగా లభించినట్లు రోజువారీ గణాంకాల్లో నమోదైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాదం తదితర విభాగాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచారు

Original source: prabhanews.com
Read more on Kaizer News