Kaizer News

Guntur: వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళ

Guntur: వినాయక మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శుక్రవారం నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. తొలుత 38వ డివిజన్ రాజేంద్రనగర్ మెయిన్ రోడ్డులో గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 43వ డివిజన్ విద్యానగర్ జీరో లైన్‌లో రావి రామచంద్రరావు మరియు విద్యానగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా 43వ డివిజన్‌లోని సాయిబాబా రోడ్ నార్నీ టవర్స్ సెంటర్ వద్ద గణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన సేవ అందిస్తున్న యువతను అభినందించారు. అనంతరం 32వ డివిజన్ బ్రాడీపేట 6/18 ప్రాంతంలో బ్రాడీపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి అన్నదాన కార్యక్రమానికి హాజరై నిర్వాహకులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 25వ డివిజన్ శ్రీ లక్ష్మీనగర్ 1/6వ లైన్‌లో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మరియు అధ్యక్షులు గాలం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు భక్తి, ఐకమత్యం, సామాజిక సేవకు ప్రతీకలని అన్నారు. యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానాలు, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News