Shorts Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ అల్పపీడనం బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సముద్ర తీరం వెంబడి గంటకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారుతున్నందున, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు దంచికొట్టనున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రయాణాలు చేసేవారు మరియు రోడ్లపై తిరిగే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పుల వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. విద్యుత్ తీగలు, హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజులు వాతావరణం చల్లబడటంతో పాటు భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మరియు యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది