Kaizer News

తిమ్మనగర్ రైతువేదికలో చోరీ..

తిమ్మనగర్ రైతువేదికలో చోరీ..

· State - Telangana · prabhanews.com

పిట్లం, ఆంధ్రప్రభ : పిట్లం మండలం తిమ్మనగర్ రైతువేదికలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి రైతువేదికకు వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బ్యాటరీ, ఇన్వర్టర్‌ను అపహరించారు. శనివారం వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ ఫిర్యాదు మేరకు పిట్లం ఎస్సై బి. అంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన వ్యక్తుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్సై అంజనేయులు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News