Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల నుంచి సభలు ప్రారంభమవుతాయని పేర్కొంటూ అసెంబ్లీ అధికారులు శాసనసభ సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని అందిస్తూ సర్కులర్‌ను పంపించారు. తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే