Kaizer News

భక్తి... భావోద్వేగం...

భక్తి... భావోద్వేగం...

· Entertainment · sakshi.com

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ ఖరారైంది. ఈ చిత్రంలో కాజల్‌ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వంలో బిర్లా స్టూడియోస్, టెంపుల్‌ టౌన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ముందుగా థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత జీ5 తెలుగులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని మేకర్స్‌ తెలిపారు. ‘‘భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం... ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సర్వశక్తిమంతమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నుంచి స్ఫూర్తి పొంది, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో చక్కని అనుభూతినిచ్చేలా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News