బెజ్జంకి, వెలుగు: గుగ్గిళ్ల గ్రామ శివారులోని ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కలుషిత నీటిని పంట కాలువలకు విడుదల చేస్తుండటంతో అఖిలపక్ష నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ కలుషిత నీటి వల్ల చేపలు, మూగజీవాలు మృతి చెందాయని, తోటపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అస్వస్థతకు గురయ్యారని నాయకులు ఆరోపించారు. ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్చేశారు