Kaizer News

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

· State - Telangana · prabhanews.com

తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండలం కొడిశాల సమీపంలో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. గంగారం మండలం అందుగులగూడెం గ్రామానికి చెందిన కుంజా ప్రభాకర్‌ అందుగులగూడెం నుంచి పస్రా వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కొడిశాల సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రభాకర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తాడ్వాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచనామా నిర్వహణ నిమిత్తం మృతదేహాన్ని ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది

Original source: prabhanews.com
Read more on Kaizer News