జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మఘ నక్షత్రంలో రాశిలో కేతువు.. సూర్యుడు, బుధుడు కలిసి సంచరించడం వలన త్రిగ్రహయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల, వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. మూడు గ్రహాలు కలిసి ఒకే నక్షత్రంలో సంచరించడంంతో ఐదు రాశుల వారికి అదృష్టం తలుపుతుడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం..! సూర్యుడు, బుధుడు మఘ నక్షత్రంలో సంచరిస్తున్నారు. కేతువు కూడా అదే నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మూడు గ్రహాలు ఒక ప్రత్యేకమైన సంయోగాన్ని ఏర్పరిచాయి. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, సూర్యుడు, బుధుడు, కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నందునకొందరికి అనుకూల ఫలితాలు లభించగా మరికొందరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు . మేష రాశి : మఘ నక్షత్రంలో త్రిగ్రహ యోగం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా శుభం కలుగుతుంది. వీరికి ఈ సమయంలో అనేక శుభసంకేతాలు అందుతాయి.గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న భయాలు, ఆందోళనలు పూర్తిగా నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పుడితే అధికంగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. స్నేహితులతో చాలా రోజులుగా నడుస్తున్న విభేదాలు, మనస్పర్థలు ఈ సమయంలో పటాపంచలవుతాయి. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.పెళ్లికాని వృషభరాశి యువతీ యువకులకు ఈ కాలంలో వివాహ ఘడియలు దగ్గరపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వృషభ రాశి: సూర్యుడు, బుధుడు, కేతువు కలిసి ఒకే నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలమూన ఫలితాలు ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు అందుతుంది. ఆత్మవిశ్వాశం పెరిగే అవకాశం ఉంది. తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా సానుకూల పలితాలుంటాయి. ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులు పరిచయవుతారు. ఎన్నో ఏళ్లుగా, నెలలుగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు చాలా సులువుగా పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి. కెరీర్‌లో ముందుకు వెళ్లడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కర్కాటక రాశి : త్రిగ్రహ సంయోగం వలన ఈ రాశి వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఊపందుకొని విజయవంతంగా పూర్తిచేస్తారు.కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్థులకు కీలక బాధ్యతుల లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పా