Kaizer News

ప్రతిభ ఉన్నా దక్కని ఉద్యోగం!

ప్రతిభ ఉన్నా దక్కని ఉద్యోగం!

· State - Telangana · ntnews.com

వేదపారాయణదారుల ఎంపికలో టీటీడీ అన్యాయం స్థానికత పేరుతో తెలంగాణ పండితులకు రిక్తహస్తం రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరున్నా ఫలితం శూన్యం చైర్మన్‌ సిఫార్సులతో అనర్హులకు నియామకాలు? ఏపీలోనూ కొందరికి అడ్డుగా మారిన ‘ఇంటిపేరు’ సోషల్‌మీడియాలో వివిధ రాష్ర్టాల అభ్యర్థుల ఆగ్రహం ‘నమస్తే’ కథనంపై తెలంగాణ, ఏపీలో పెద్ద ఎత్తున చర్చ హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆయన వేదవిద్యలో ఘనాపాటి.. తన శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించారు. అరుదైన వేదపండితుల్లో ఒకరిగా చిన్న వయసులోనే పేరుపొందారు. అటువంటి వేదపండితుడికి ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయం జరిగింది. టీటీడీ వేదపారాయణదారు పోస్టుకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చారు. కానీ, ఆయనకు స్థానికత అడ్డంకిగా మారింది. ఆయనకు పోస్టు కచ్చితమని చెప్పిన గురువులు, వేదపండితులు ఈ విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణంగా నియామక ప్రక్రియ జరిగిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. పది నుంచి పదిహేను మంది వరకు వేదంలో అద్భుతమైన ప్రతిభతో దేశవిదేశాల్లో రాణిస్తున్నా, స్థానికంగా ప్రభుత్వ, టీటీడీ ఉద్యోగాల వరకు వచ్చేసరికి విఫలమవుతున్నారు. తాము చెప్తున్న పన్నంలో తేడా ఉన్నదా? లేక స్థానికతే తమకు అడ్డంగా మారిందా? అనేది వాళ్లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీటీడీలో వేదపారాయణదారు నియామకాలకు సంబంధించి తెలంగాణ పండితులు 20 మందిలోపే ఎంపిక కావడంపై వివాదం ముదురుతున్నది. ఎంపికైనవారిలోనూ ఎక్కువ మంది స్థానిక టీటీడీల్లో పనిచేస్తున్న వారి కొడుకులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గురువుల వద్ద విద్యనభ్యసించినవారని.. ఇలా ఏదో ఒక కొలమానం ఉంటేనే వారికి ఉద్యోగం దక్కిందనే ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ వారికి స్థానికతే అడ్డుగా మారిందంటూ ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష’ శీర్షికన ప్రచురితమైన కథనం రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలన్నీ వాస్తవమని పరీక్షలకు హాజరైన తెలంగాణ అభ్యర్థులు చెప్తుండగా, తమకు కూడా అన్యాయం జరిగిందంటూ కొందరు ఆంధ్రా పండితులు కొత్త చర్చకు తెరలేపారు. గతంలో జరిగిన వేదపారాయణదారు నియామకాల్లో ఆంధ్రావారికి అవకాశం కల్పించినా తాము అడ్డుకోలేదని తెలంగాణ పండితులు చెప్తున్నారు. కానీ ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో వారే ఉద్యోగాలు తన్నుకుపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. పరీక్షల మార్కులు వచ్చిన తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ వేసి తమకు అన్యాయం చేయడం వెనుక పెద్ద తతంగమే ఉన్నదని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఆంధ్రాలో కూడా తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు పండితులు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్‌ చేసి చెప్పారు. వేదపారాయణదారు పోస్టుల్లో తమవారిని నింపుకోవడానికి కొందరు పరీక్షాధికారులు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన వారు తమను తొక్కిపెట్టారంటూ వారు ఆవేశంగా చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా తమను కాదని, కేవలం కొందరి ఇంటి పేర్లు కలిగిన వారికే పట్టం కట్టారని ఆరోపించారు. క్రమాపాఠి, ఘనాపాఠిల ఎంపిక ప్రక్రియలో ఆంధ్రా వారికి అర్హత మార్కులను 85 మార

Original source: ntnews.com
Read more on Kaizer News