Prema | దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి ప్రేమ.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన పలు రూమర్లకు తాజాగా చెక్ పెట్టారు. ముఖ్యంగా తనకు క్యాన్సర్ వచ్చిందంటూ గతంలో జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో తన రెండో వివాహంపై వస్తున్న వార్తలపైనా ఆమె ఆసక్తికరంగా స్పందించారు. జీవితాంతం తనకు తోడుగా ఉండే సరైన వ్యక్తి దొరికితే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ.. వెంకటేష్ సరసన నటించిన ‘ధర్మచక్రం’, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. గతంలో తనకు క్యాన్సర్ సోకిందంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి రావడంపై ప్రేమ తీవ్రంగా స్పందించారు. తాను న్యూజిలాండ్‌కు స్నేహితురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఈ పుకార్లు వ్యాపించాయని తెలిపారు.క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన సోనాలి బింద్రే, మమతా మోహన్‌దాస్, గౌతమి వంటి నటీమణులను ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే తనకు మాత్రం అలాంటి అనారోగ్య సమస్య ఏదీ లేదని స్పష్టం చేశారు. దేవుడి దయతో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. తన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు రావడం బాధ కలిగించిందని చెప్పిన ప్రేమ.. ఆ సమయంలో తల్లిదండ్రుల అండ తనకు ఎంతో మానసిక బలాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ప్రేమ వ్యక్తిగత జీవితంలో 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పాచ్చును వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ విభేదాల కారణంగా 2016లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రేమ ఒంటరిగా ఉంటున్నారు.ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ అంశంపై కూడా ఆమె స్పందించారు. పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు