Shorts Karimnagar: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఈ రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పాత గ్రామపంచాయతీనీకూల్చేందుకు తమకు ఆర్డర్స్ ఉన్నాయంటూ అధికారులు రాగా పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి నుండి నడిచిన హైడ్రామా నడుమ ఉదయం పోలీసులు ఎంట్రీ ఇచ్చి బలవంతంగా పలకవర్గాన్ని అడ్డుకుని జేసీబీ తో పాత గ్రామపంచాయతీ భవనాన్ని కూల్చుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా కుల్చడానికి రావడంతో సర్పంచ్ పాలకవర్గ సభ్యులు అడ్డుకున్నారు. ప్రొసీజర్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సునీత ఆరోపించారు. తిమ్మాపూర్ సర్కిల్ పోలీసులతో భారీ బందోబస్తు నడుమ వచ్చిన అధికారులు సర్పంచ్ సునీత భర్త పొన్నం అనిల్ గౌడ్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ అధికారులు వాదించగ, తమకు కూడా గతంలో కూల్చవద్దని గ్రామపంచాయతీ ఇతర అవసరాలకు పాత కార్యాలయము వాడుకోవాలని గతంలో చెప్పినట్లు పాలకవర్గం వివరించారు