Shorts Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు . జిల్లా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన ఈ పర్యటనలో ఆయన పలు సేవా , రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఖమ్మం నగరంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా పాత బస్‌స్టాండ్‌లో స్వచ్ఛ భారత్ నిర్వహించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది . పార్టీ సంస్థాగత బలోపేతం , కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నూతన పదాధికారులకు అధికారిక నియామక పత్రాలను అందజేశారు . సమావేశంలో జిల్లా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ ప్రసంగిస్తూ.. దశాబ్దాలుగా దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న రాజకీయ శక్తులకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి బీజేపీయే అసలైన వేదికని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తామని , క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేసి దళితవాడల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు , కార్యాలయ కార్యదర్శి విష్ణు , ఉపాధ్యక్షులు బోయల వెంకట్, రాష్ట్ర అధికార ప్రతినిధి స్వర్ణఖర్ , ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ సుదర్శన్ , ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ , రాకేష్ బాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’