Kaizer News

TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్‌-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

· State - Telangana · ntvtelugu.com

తెలంగాణలో TGTET ఇన్-సర్వీస్ టీచర్స్-2026 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉద్యోగ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో (CBT) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షల వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు గణితం-సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. తిరిగి సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండవ విడత పేపర్-2 పరీక్షలు ఉంటాయి

Original source: ntvtelugu.com
Read more on Kaizer News