పశ్చిమ బెంగాల్ రాజకీయ రంగాన్ని శాసిస్తూ, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఏకచత్రాధిపత్యం చెలాయించిన మమతా బెనర్జీకి తన సొంత రాజకీయ ఉనికిలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత తిరుగుబాటు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పేరును, పార్టీ అధికారిక గుర్తు అయిన గడ్డిపూలు గుర్తును రెండు వర్గాలు వాడటానికి వీల్లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తూ సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 6న జరగబోయే నందిగ్రామ్, రెజినగర్ శాసనసభ ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడటం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలో చెలరేగిన తిరుగుబాటు. ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, సీనియర్ నేత అరూప్ రాయ్ నేతృత్వంలోని రెబల్ వర్గం అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు సుమారు 60 మంది మద్దతును కూడగట్టుకుని, తామే అసలైన టిఎంసి అని క్లెయిమ్ చేయడం ప్రారంభించింది. 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, సొంత చేతులతో గీసుకున్న గడ్డిపూలు గుర్తుతో పార్టీని నిర్మించుకున్న మమతకు.. ఇప్పుడు ఎన్నికల సంఘం ముందు తన సొంత పార్టీ గుర్తు పైనే హక్కులను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఇరువర్గాల వాదనలు విన్న ఎన్నికల కమిషన్, సింబల్స్ ఆర్డర్ లోని పేరా 15 ప్రకారం.. ప్రధాన వివాదంపై తుది విచారణ తేలేవరకు ఇరువర్గాలకు సమాన ప్రాతిపదికన అవకాశమివ్వాలని భావించింది. అందులో భాగంగానే మమతా బెనర్జీ వర్గం , రితబ్రత-అరూప్ రాయ్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం.. రెండూ కూడా పార్టీ పేరు, పాత గుర్తును వాడటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఉపఎన్నికల కోసం మూడేసి ప్రత్యామ్నాయ పేర్లు, అలాగే ఈసీ అందుబాటులో ఉంచిన ఉచిత గుర్తులలో మూడేసి ప్రాధాన్యతలను సమర్పించాలని ఆదేశించింది. గతంలో మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ వ్యవహారాల్లో కూడా ఎన్నికల సంఘం సరిగ్గా ఇలాంటి విధానాన్నే అనుసరించింది. తొలుత గుర్తులను ఫ్రీజ్ చేయడం, ఆ తర్వాత శాసనసభా పక్షం లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందో లెక్కించి, చివరికి రెబల్ గ్రూపులకే అసలైన పార్టీ, గుర్తు ను కేటాయించడం జరిగింది. ఇప్పుడు బెంగాల్‌లో కూడా శాసనసభలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు రితబ్రత-అరూప్ రాయ్ వర్గం వైపే ఉండటం, ఎంపీల్లో కూడా కొందరు విడిపోవడంతో.. శివసేన, ఎన్సీపీల తరహాలోనే అధికారిక టిఎంసి పేరు, గుర్తు రెబల్ వర్గానికే దక్కుతాయా అనే అనుమానాలు మమత శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఒకవేళ ఈసీ తుది నిర్ణయంలో పార్టీ రికార్డులు లేదా మెజారిటీ ప్రాతిపదికన రెబల్ వర్గానికే తృణమూల్ కాంగ్రెస్ పేరు దక్కితే, మమతా బెనర్జీ కొత్త పేరుతో, సరికొత్త ఎన్నికల గుర్తుతో రంగంలోకి దిగక తప్పదు. దశాబ్దాలుగా ప్రజల్లో నాటుకుపోయిన గుర్తును కోల్పోవడం, కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడం మమతా బెనర్జీకి, ఆమె మద్దతుదారులకు అత్యంత కష్టతరమైన సవాలు. మమతా బెనర్జీ వర్గం ఈ నిర్ణయాన్ని చట్ట విరుద్ధమైనది గా అభివర్ణిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. అయినప