Kaizer News

Mahendragiri Varahi Trailer : వారణాసి గ్రామ దేవతే

Mahendragiri Varahi Trailer : వారణాసి గ్రామ దేవతే వారాహి - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్... స్పెషల్ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ

· Entertainment · telugu.abplive.com

వైవిధ్యమైన కథలు, వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్. ఇప్పుడు మైథలాజికల్ మూవీ 'మహేంద్రగిరి వారాహి'తో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ హైప్ క్రియేట్ చేయగా... తాజా ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. 'చరిత్రకి అందని నగరం ఆ పరమశివుడు నివసించే ప్రదేశం వారణాసి. ఆ వారణాసి గ్రామ దేవతే వారాహి...' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ట్విస్టులు ఓ ఊరికి రాజవంశానికి చెందిన శాపం కథతో ఆసక్తి రేకెత్తించింది. మహేంద్రగిరి అనే ఊరిలో కొలువై ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ ఫుల్. అక్కడ రాజ కుటుంబంలో జరుగుతున్న వరుస మరణాల్ని... దాని వెనుక ఉన్న రహస్యాల్ని ఛేదించేందుకు హీరో చేసే సాహసాలను చూపించారు. అసలు రాజ వంశానికి వారాహి అమ్మవారు ఇచ్చిన శాపం ఏంటి? ఎందుకు ఇచ్చారు? నిజంగా అమ్మవారి శాపం వల్లే రాజ కుటుంబంలో ప్రతీ ఏటా చనిపోతున్నారా? అమ్మవారు హీరోకు ఏ విధంగా సహాయం చేశారు? లేదా ఈ మరణాల వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ల మూడి దర్శకత్వం వహించగా... సుమంత్, ఐశ్వర్య రాజేష్‌లతో పాటు వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్, రాజీవ్ కనకాల తదితరులు కీలకపాత్రలు పోషించారు. సినిమాలో ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కీలకపాత్ర పోషించారు. రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next బుందేల్‌ఖండ్ లోయల్లో పోలీస్ vs డెకాయిట్... జీ5లో ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ పాలిటిక్స్ లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? పాలిటిక్స్ ప్రధాని మోదీ టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ - తెలుగు రాష్ట్రాలకు దక్కే కొత్త పదవులు ఎవరికి? ప్రపంచం మృతదేహాల దిబ్బగా నేపాల్‌! టిబెట్‌లో వాస్తవ పరిస్థితి బయటపెట్టని చైనా! సినిమా వారణాసి గ్రామ దేవతే వారాహి - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్... స్పెషల్ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ అమరావతి ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు! క్రికెట్ విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లోకి అనయ బంగర్ ఎంట్రీ.. మారిజానే కాప్ విమర్శలకు కౌంటర్ తో స‌మాధానం.. హైదరాబాద్ అ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News