Kaizer News

Bhupalpally: భూపాలపల్లిలో దొంగల హల్‌చల్.. తాళం వేస

Bhupalpally: భూపాలపల్లిలో దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇంట్లో చోరీ!

· State - Telangana · hmtvlive.com

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు... దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 4 తులాల బంగారం 20 తులాల వెండి 4000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు వెల్లడించారు.... సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News