కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి సర్కార్, యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుపై వ్యతిరేకత సింగరేణి వారికి ఇచ్చిన హామీని మరచిన ప్రభుత్వం పెద్దపల్లి, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో కారుణ్య నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మంగళం పాడుతున్నది. ఎన్నికల ముందు ‘కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తున్నది.. మేం అధికారంలోకి వస్తే నెలకు మూడు, నాలుగు మెడికల్ బోర్డులను నిర్వహిస్తాం.. బోర్డుకు వచ్చిన ప్రతి సింగరేణి కార్మికుడి కొడుక్కు, కూతురుకు ఉద్యోగాలు ఇస్తాం’ అని ఇచ్చిన హామీలు మోస పూరితమేనని తేలిపోయింది. జూలైలో జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలిచి 24 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేయగా.. తాజాగా గురువారం జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలిచి కేవలం 12 మందిని మాత్రమే మెడికల్ అన్ ఫిట్ చేసి తన మోసాన్ని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో పనిచేస్తున్న దాదాపుగా 40 వేల మంది కార్మికుల కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేస్తున్నది. తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబు చూపిన మార్గంలోనే నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ హక్కులను కాలరాస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా 16,500 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెడికల్ బోర్డులను సక్రమంగా నిర్వహించకపోగా.. రిక్రూట్‌మెంట్‌ను సైతం సక్రమంగా చేపట్టకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధమయ్యారు. ఆందోళనలు, సమ్మె నోటీసులతో దిగి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూన్‌లో మెడికల్ బోర్డు నిర్వహిస్తామని కార్మికుల్లో ఆశలు రేకెత్తించారు. ఎట్టకేలకు దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 17, 18వ తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖానలో 124 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచారు. ఇందులో 24 మంది కార్మికులు సరైన సమాచారం లేక, ఇతర కారణాలతో గైర్హాజరు కాగా పరీక్షలకు హాజరైన 100 మందిలో కేవలం 24 మందిని మాత్రమే మెడికల్ అన్ ఫిట్ చేశారు. 38 మందిని తిరిగి విధుల్లో చేరాలని, మిగతా వారంతా విధుల్లో కొనసాగాలని ఆదేశించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 75 నుంచి 85 శాతం వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ జరుగగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 25 శాతం మాత్రమే జరుగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా తాజాగా, ఈ నెల 27న జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలువగా.. ఇందులో 71 మంది మాత్రమే హాజరయ్యారు. 43 మంది కార్మికులను ఫిట్ ఫర్ సేమ్ జాబ్‌కు ఎంపిక చేయగా.. 14 మందిని సర్ఫేస్‌కు కేటాయించారు. ముగ్గురు కార్మికులను హయ్యర్ సెంటర్‌కు రిఫర్ చేశారు. ఇందులో 48 మంది కార్మికులు మెడికల్ బోర్డుకు గైర్హాజరయ్యారు. కేవలం 12 మంది కార్మికులను మాత్రమే మెడికల్ అన్‌ఫిట