ఉట్నూర్, ఆంధ్రప్రభ : గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచనల మేరకు ఈ కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవలి నివేదికలు కూడా వెల్లడించాయి. ఆదివారం ఉట్నూర్ మండలం నర్సాపూర్ (జే) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 21 మందితో గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ జూగాది రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా షేక్‌ను, ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా గడపగడపకు ప్రచారం నిర్వహించాలని, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, జిల్లా ఆర్టీఏ సభ్యుడు దూట రాజేశ్వర్, జిల్లా నాయకులు మరుసుకోల తిరుపతి, బీర్సాయిపేట సర్పంచ్ రాజేశ్, దంతన్‌పెల్లి ఉపసర్పంచ్ మహమ్మద్ మోబిన్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు