Shorts Adilabad: ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఇచ్చోడ విద్యార్థులను ప్రముఖ సామాజిక సేవకుడు, గుడిహత్నూర్ జై దేవి మెడికల్ అధినేత గిత్తె మదన్ ఘనంగా సన్మానించి, ప్రత్యేక ప్రోత్సాహకంగా స్మార్ట్ వాచ్‌లను బహుమతిగా అందజేశారు. జల్దా గ్రామానికి చెందిన గిత్తె మదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన సృష్టి మారుతీ ముండే, చించోలి గ్రామానికి చెందిన సృష్టి రాంచందర్ కేంద్రే, సేజల్ సంజీవ్ గిత్తేలను శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు వైద్య విద్యలో రాణించడంతో పాటు సమయపాలనకు ఉపయోగపడేలా ఆయన తన సొంత ఖర్చులతో విలువైన స్మార్ట్ వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి వారిని మరింత ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి గ్రామానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు గిత్తె మదన్ స్మార్ట్ వాచ్‌లు అందించి ప్రోత్సహించడాన్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంజారి సంఘం పెద్దలు సుధామ్ గిత్తే, రాంచందర్ తిడ్కే, భానుదాస్ గిత్తే, డాక్టర్ బాలకృష్ణ, మౌళి, సురేష్, చక్రపాణి తదితరులు పాల్గొని విద్యార్థుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు