Kaizer News

స్పైసీ పీనట్‌ బటర్‌

స్పైసీ పీనట్‌ బటర్‌

· State - Telangana · ntnews.com

కావల్సిన పదార్థాలు పల్లీలు: రెండు కప్పులు పల్లీ నూనె: టేబుల్‌ స్పూను తేనె: ఒక టేబుల్‌ స్పూన్‌ ఉప్పు: అర స్పూను చిల్లీ ఫ్లేక్స్‌: అర స్పూను బ్రెడ్‌తో మనం ఇష్టంగా తినే పీనట్‌ బట్టర్‌ తయారు చేయడానికి, ముందుగా పల్లీలను సన్నటి ఫ్లేమ్‌ మీద బాగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక కప్పు పల్లీలను మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడికి నూనె, తేనె కలపాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత మిగిలిన కప్పు పల్లీలను కొద్దికొద్దిగా ఈ మిశ్రమానికి కలుపుతూ గ్రైండ్‌ చేస్తూ పోవాలి. ఎక్కడా నీరు కలపకూడదు. అలా మొత్తం పల్లీలను ఇలా మెత్తగా ముద్దగా చేసుకుంటే పీనట్‌ బటర్‌ సిద్ధమైపోతుంది. అక్కడక్కడ కొద్దిగా పల్లీలు తగలాలి అని ఇష్టపడేవారు మరో అరకప్పు పల్లీలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసి ఈ మిశ్రమానికి కలుపుకోవచ్చు. కారంకారంగా పీనట్‌ బటర్‌ కావాలనుకుంటే ఈ ముద్దకు చిల్లీ ఫ్లేక్స్‌ని జత చేసుకుంటే సరి!

Original source: ntnews.com
Read more on Kaizer News