Kaizer News

Rayachoti: నక్కవాండ్లపల్లెలో వినాయక పూజలు, అన్నదాన

Rayachoti: నక్కవాండ్లపల్లెలో వినాయక పూజలు, అన్నదానంలో సుగవాసి ప్రసాద్ బాబు

· State - Telangana · hmtvlive.com

Shorts రాయచోటి: వినాయకుని వారోత్సవాలను పురస్కరించుకుని రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామం నక్కవాండ్లపల్లెలో ఆదివారం రాత్రి నిర్వహించిన వినాయకుని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ.. వినాయకుని సన్నిధిలో కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం అభినందనీయమని, భక్తితో పాటు సేవాభావాన్ని పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజమాలతో సత్కరించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News