దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని నంబాల, వెల్గనూర్, ద్వారక గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డేగ బాపు, గోపతి రాజయ్య, బెడద సురేష్, పత్తిపాక సంతోష్, బత్తుల శేఖర్, బండే సత్యం, మొరుపుటల సంజీవ్, గడికొప్పుల సురేందర్, ఎంబడి సురేందర్, నలిమెల మహేష్, లక్కాకుల బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు