Amaravati: అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం ఓ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం వివిధ ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ […]