Burning Topic: హిమాలయ రాజ్యం నేపాల్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. భీకర ఆకస్మిక వరదలు కుదిపేసి నాలుగు రోజులేనా గల్లంతైన, మృతుల సంఖ్య విషయంలో స్పష్టత లేదు. గల్లంతైన వారి సంఖ్య రెండు వేలకు పైగానే ఉంటుందని తాజా అంచనా. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు కొట్టుకొస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 700 దాటింది. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. చిత్వన్, గోర్ఖా, రసువా, ధాదింగ్, నవల్పూర్, నౌవల్పరాసి, నువాకోట్, తనహు ప్రాంతాల్లో వందలాది శవాలు దొరుకుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టారు. త్రిశూలిలో నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సహాయక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్ తొలుత తిరస్కరించింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. గల్లంతయిన వారిలో పలు దేశాల ప్రజలు ఉన్నారు. సహాయక చర్యల్లో భాగం అవుతామని దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా చివరకు నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్ నుంచి భారత్‌కు అత్యవసర సహాయం అందుతోంది. తాజాగా 10 టన్నుల సామగ్రితో మూడో విమానం ఆ దేశంలో ల్యాండ్ అయింది. అలాగే 11 మంది బృందం కూడా వెళ్లింది. వారిలో వైద్యులు, సొరంగాల వద్ద సహాయక చర్యలు నిర్వహించగల సిబ్బంది, ఇతరులు ఉన్నారు. నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో గ్రామాలు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. రవాణా సౌకర్యం మూసుకుపోవడంతో ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో హెలికాప్టర్లను రంగంలోకి దించారు అధికారులు. త్రిశూలి, రసువా ప్రాంతాల్లోని వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న191మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో గత నాలుగు రోజులుగా మూసివేసిన ముగ్లింగ్-ఖాట్మండు ప్రధాన రహదారిని తిరిగి తెరిచారు. దీంతో దారిమధ్యలో నిలిచిపోయిన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రభుత్వం డిజాస్టర్ జోన్లుగా ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే భారీ ఆకస్మిక వరదల నుంచి ఇంకా కోలుకోకమునుపే నేపాల్‌కు మరో హెచ్చరిక వచ్చింది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. నదీ ప్రవాహానికి అడ్డుకట్టతో బారియర్ సరస్సు ఏర్పడింది. అది ఎప్పుడైనా కట్టలు తెంచు