Kaizer News

కవలల గర్భధారణలో.. హై రిస్క్ నుంచి హెల్దీగా..

కవలల గర్భధారణలో.. హై రిస్క్ నుంచి హెల్దీగా..

· State - Telangana · v6velugu.com

గర్భధారణ అంటే ప్రతి కుటుంబానికీ ఆనందం, ఎన్నో ఆశలు. కానీ అల్ట్రాసౌండ్‌లో బిడ్డ ఆశించినంతగా ఎదగడం లేదని తేలినా, శరీర నిర్మాణంలో ఏదైనా తేడా కనిపించినా, జన్యుపరమైన సమస్య ఉందని పరీక్షల్లో తెలిసినా ఆ ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారుతుంది. కవలల గర్భంలో సమస్యలు ఎదురైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చు. హైదరాబాద్‌‌లో ఫీటల్‌‌ మెడిసిన్‌‌ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందడంతో గర్భధారణను చూసే విధానంలోనూ మార్పు వచ్చింది. సమస్య తీవ్రంగా మారిన తర్వాత చికిత్స చేయడం కంటే, అది వచ్చే అవకాశం ఉందా అని ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ముఖ్యమవుతోంది. తొలి మూడు నెలల్లో చేసే పరీక్షలు కేవలం బిడ్డ గుండె కొట్టుకుంటుందా లేదా అనే విషయానికే పరిమితం కావు.11 నుంచి13 వారాల మధ్య చేసే సమగ్ర పరీక్షలతో బిడ్డ ప్రారంభ ఎదుగుదలను పరిశీలించొచ్చు. కొన్ని జన్యుపరమైన, శరీర నిర్మాణ సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా అంచనా వేయొచ్చు. నూచల్‌‌ ట్రాన్స్‌‌లూసెన్సీ పరీక్షను తల్లి రక్త పరీక్షలతో కలిపి చేయడం ద్వారా డౌన్‌‌ సిండ్రోమ్‌‌ వంటి క్రోమోజోమ్‌‌ సమస్యలు ఉండే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. తల్లి రక్తంలో ఉండే బిడ్డకు సంబంధించిన డీఎన్‌‌ఏను పరిశీలించే నాన్‌‌-ఇన్వేసివ్‌‌ ప్రీనేటల్‌‌ టెస్టింగ్‌‌ (ఎన్‌‌ఐపీటీ) కూడా సాధారణ క్రోమోజోమ్‌‌ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడే మరో సున్నితమైన స్క్రీనింగ్‌‌ పరీక్ష. స్క్రీనింగ్‌‌ పరీక్షల్లో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలితే, కోరియానిక్‌‌ విల్లస్‌‌ శాంప్లింగ్‌‌ (సీవీఎస్‌‌), అమ్నియోసెంటిసిస్‌‌ వంటి నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు. వీటి ద్వారా క్రోమోజోమ్‌‌ లేదా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయా లేదా అన్నది మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ దశలో క్లినికల్‌‌ జెనెటిక్స్‌‌, జన్యు సలహా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే ప్రీ-ఎక్లాంప్సియా, ముందస్తు ప్రసవం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న మహిళలను కూడా గుర్తించొచ్చు. ఫీటల్‌‌ మెడిసిన్‌‌లో వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి.. గర్భస్థ శిశువును పుట్టకముందే ప్రత్యేక వైద్య శ్రద్ధ అవసరమైన రోగిగా అంచనా వేసి, కొన్ని పరిస్థితుల్లో చికిత్స చేయగలగడం. మెదడు, గుండె, మూత్రపిండాలు, ఎముకలు, ఇతర అవయవాల్లో ఉండే నిర్మాణ సమస్యలను పుట్టకముందే గుర్తించొచ్చు. ఫీటల్‌‌ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా గుండెకు సంబంధించిన ముఖ్యమైన లోపాలను కూడా పుట్టకముందే గుర్తించే అవకాశం ఉంది. కొందరికి పుట్టిన వెంటనే నియోనేటల్‌‌ ఇంటెన్సివ్‌‌ కేర్‌‌ అవసరం కావచ్చు. మరికొందరికి పిల్లల శస్త్రచికిత్స నిపుణుల సేవలు అవసరమవుతాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో చికిత్సను బిడ్డ పుట్టే వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు.ఉదాహరణకు బిడ్డకు తీవ్రమైన రక్తహీనత ఏర్పడితే, గర్భంలోనే రక్త మార్పిడి చేయొచ్చు. కొన్ని ప్రత్యేక గుండె స్పందన సమస్యలు, మరికొన్ని పరిస్థితుల్లోనూ బిడ్డ గర్భంలో ఉండగానే చికిత్స చేసే అవకాశం ఉంది. హైదరాబాద్​లో హైరిస్క్‌‌ గర్భధారణను ఇప్పుడు ఫీటల్‌‌ మెడిసిన్‌‌ నిపుణులతోపాటు ప్రసూతి వైద్యులు, ఫీటల్‌‌ కార్డియాలజిస్టులు, జన్యు సలహాదారులు, నియోనేటాలజిస్టులు, పిల్లల శస్త్రచికిత్స నిపుణులు, అవసరాన్ని

Original source: v6velugu.com
Read more on Kaizer News