Kaizer News

Etihad cancels flight | విమానాన్ని రద్దు చేసిన ఎతి

Etihad cancels flight | విమానాన్ని రద్దు చేసిన ఎతిహాద్.. ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 200 మంది ప్రయాణికులు

· National - India · ntnews.com

న్యూఢిల్లీ: అబుదాబి వెళ్లాల్సిన విమానాన్ని ఎతిహాద్ ఎయిర్‌వేస్ రద్దు చేసింది. దీంతో 200 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. సాంకేతిక కారణాలతో ఆ విమానం రద్దైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రయాణికులు దృష్టిసారించారు. (Etihad cancels flight) ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం ఈవై217 శనివారం రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ నుంచి అబుదాబికి బయలుదేరాల్సి ఉన్నది. అయితే ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక సమస్య తలెత్తిందని సిబ్బంది తెలిపారు. సుమారు 200 మంది ప్రయాణికులను విమానం నుంచి దించివేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆ విమాన ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 200 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. ప్రత్యామ్నాయ మార్గాలపై వారు దృష్టిసారించారు. కాగా, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 787 విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఢిల్లీ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఆ సంస్థ రద్దు చేసింది. ఆ సాంకేతిక సమస్యకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు వెల్లడికాలేదు. అయితే విమాన రాకపోకలను పర్యవేక్షించే ఫ్లైట్‌రాడార్‌24.కామ్‌ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీ-అబుదాబి సర్వీస్‌ను బోయింగ్ 787-9 విమానంతో నిర్వహించాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News