ఆసియా గేమ్స్-2026కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసియాక్రీడలు ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. అయితే ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న బుమ్రా ఈ ఆసియా క్రీడలలో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు అతడు తన గాయం నుంచి శరవేగంగా కోలుకుంటున్నాడని ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ సాహిల్ మల్హోత్రా వెల్లడించారు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఏషియన్ గేమ్స్‌లో ఆడుతాడని సాహిల్ స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న బుమ్రా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం దూరం కానున్నాడు. బుమ్రా చివరగా భారత తరపున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో ఆ తర్వాత జరిగిన అఫ్గానిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్‌లతో పాటు శ్రీలంక పర్యటనకు అతడు దూరమయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటున్నాడని టీమ్ మేనెజ్‌మెంట్ భావించింది. కానీ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో జట్టు నుంచి తప్పించారు. దీంతో అతడి స్దానంలో ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకున్నారు. కాగా బుమ్రా పూర్తిగా కోలుకున్నాకే బరిలోకి దించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే ఈ ఏడాది ఆఖరిలో భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో కీలక టెస్టు సిరీస్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు సిరీస్‌లు చాలా ముఖ్యం. ఇక ఏషియన్ గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్-19 నుంచి ప్రారంభం కానున్నాయి. చదవండి : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్ ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు) వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) రీల్స్ స్టార్ రామ్మోహన్.. ఎంపీగా శ్రీకాకుళానికి నువ్వు చేసింది ఏంటి? సిపిఎం నేతలు ఫైర్ జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా...? బొప్పరాజు రియాక్షన్ ఓటర్ ఫారాలు పల్లీల పొట్లాలుగా.. అసలేం జరుగుతోంది?'బాధ్యత ఎవరిది?'