బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోచమ్మవాడలోని శ్రీ పోచమ్మతల్లి ఆలయంలో బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులు ప్రత్యేకంగా చీరను నేసి పోచమ్మతల్లికి సమర్పించే కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. సంప్రదాయం, చేనేత కళను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేత ఆడెపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. పోచమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, బోనాల ఉత్సవాలు ఘనంగా సాగాలని వారు ఆకాంక్షించారు