Kaizer News

Korean Kanakaraju | ఓటీటీలోకి ‘కొరియన్ కనకరాజు’..

Korean Kanakaraju | ఓటీటీలోకి ‘కొరియన్ కనకరాజు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

· Entertainment · ntnews.com

Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతుంది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు. ఇదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని లక్ష్యం ఏమిటి? దాని నుంచి బయటపడేందుకు కనకరాజు ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ

Original source: ntnews.com
Read more on Kaizer News