Parvathipuram: పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన రజకుల సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. శనివారం పార్వతీపురం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్రను కలిసిన నర్సిపురం గ్రామ రజకులు ఇస్త్రీ పెట్టెలు ఇప్పించాలని, ధోబి ఖానాలు ఏర్పాటు చేయాలని, ఇంకా రజక వృత్తికి అవసరమైన ఋణాలు ఇప్పించాలని అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర త్వరలోనే ఆ సమస్యలు పరిష్కారిస్తామని రజకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండదండలుగా ప్రభుత్వం నిలుస్తోందని, ముఖ్యంగా కులవృత్తులకు అవసరమైన పనిముట్లను అందిస్తోందని వివరించారు