Kaizer News

Laxmanchand-Nirmal District | బావిలో మహిళ మృతదేహం

Laxmanchand-Nirmal District | బావిలో మహిళ మృతదేహం లభ్యం

· State - Telangana · prabhanews.com

బావిలో మహిళ మృతదేహం లభ్యం Laxmanchand-Nirmal District | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని బోరిగం తండాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తండా సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరిగం తండాకు చెందిన రాథోడ్‌ శోభ (31) భర్త సందీప్‌తో కలిసి నివాసం ఉంటోంది. శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శోభ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తండా పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో తండా సమీపంలోని ఓ బావి వద్ద శోభ చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి బావిలో వెతకగా ఆమె మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అదే తండాకు చెందిన గంగాధర్‌ కుటుంబానికి చెందిన కమల, కావేరి, సురేఖలతో గురువారం జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురై శోభ ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి రమీబాయి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News